భారత్ న్యూస్ రాజమండ్రి…గ్రామాల్లో ప్లెక్సీలు, హార్డింగ్ లు తొలగించేలా చర్యలు తీసుకోండి – ఎంపిడివో డి.సుబ్బారావు
:- ఉద్యోగుల సెలవుల రద్దు
ఘంటసాల :-
ఘంటసాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వివిధ ప్లెక్సీ బ్యానర్లను, హార్డింగ్ లను మంతా తుఫాన్ దృష్ట్యా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబందిత వ్యక్తులతో చెప్పి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడివో డి. సుబ్బారావు అధికారులను శనివారం ఆదేశించారు.
ఘంటసాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడివో మాట్లాడుతూ మంతా తుఫాన్ 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనే నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు ఆదివారం విధులకు హాజరవ్వాలని కోరారు.
ప్రజలందరూ నిత్యావసరాలు, మంచినీరు, పాలు, పెరుగు, పండ్లు, ఇతర ముఖ్యమైన మందులు, బ్యాటరీ లైట్లు, కొవ్వొత్తులు, చార్జింగ్ లైట్లు, ఇతర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు.
మండలంలోని గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేలా మహిళా పోలీసులకు, వేల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను నియమించినట్లు చెప్పారు.
ప్రస్తుతం సెలవుల్లో ఉన్న అధికారులందరూ ఆదివారం విధులకు హాజరుకావాల్సిందేనని, సెలవులన్నీ రద్దు చేస్తున్నట్లు ఎంపిడితో తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా అత్యవసర పరిస్థితుల్లో 9100084641, 9908664615 నెంబర్లను సంప్రదించాలన్నారు.

ప్రజలంతా అధికారులకు సహకరించాలని ఎంపిడివో సుబ్బారావు కోరారు.
https://t.me/+UOn9gZ6-hpe5u7ap