ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్ల సరఫరాకు నిధులు 830.04 కోట్ల మంజూరు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్ల సరఫరాకు నిధులు 830.04 కోట్ల మంజూరు

రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం అనుమతి.

1 నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు కిట్లు పంపిణీ.

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిట్లు పంపిణీ.

2026-27 విద్యాసంవత్సరంలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసేందుకు నిధులు విడుదల.

నోట్ బుక్ లు, బెల్డ్ ,షూలు, బ్యాగ్ , పిక్టోరియల్ డిక్షనరీ ,ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఇవ్వనున్న ప్రభుత్వం.

పాఠ్య పుస్తకాలు , వర్క్ బుక్ లు, 3 జతల యూనిఫాం క్లాత్ లతో కూడిన కిట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.

కిట్ల సేకరణ పంపిణీ కోసం రూ.157.20 కోట్లు నిధులు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.

టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా, పంపిణీ దారులను నిర్ణయించాలని ఆదేశాలు.

ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.