సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ప్రతి రైతుకి రూ.20వేలు ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదు.

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏడాది పాలన అంతా గొప్పల మయం. డబుల్ ఇంజన్ కాదు. ట్రబుల్ ఇంజన్, సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ప్రతి రైతుకి రూ.20వేలు ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్తున్నారు. తల్లికి వందనం కింద బిడ్డలను మోసం చేస్తున్నారు. 87 లక్షల మంది పిల్లలు ఉంటే.. 67 లక్షల మందికి ఇచ్చారు. నిరుద్యుగ భృతి ఊపే లేదు. మహిళలకు మహిళా శక్తి లేదు. రెండు కోట్ల మంది మహిళలను మోసం చేశారు

గ్యాస్ ఒక్కటి అరకొర ఇచ్చి గొప్పలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఊసే లేదు. కర్ణాటక, తెలంగాణలో గొప్పగా ఉచిత బస్సు అమలు అవుతుంది. మహిళలకు భద్రత కల్పించాలని సోయి కూడా లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. ఒక్కరికి ఉద్యోగాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇదేనా సుపరిపాలన? నాలుక మందం మందం ఎవరికి ఎవరిక ? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. ప్రశ్నించే మాకు కాదు నాలుక మందం. హామీలు ఇచ్చి మోసం చేసిన మీకే నాలుక మందం చంద్రబాబు గారు.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ మూడు బిజేపీ పార్టీలే. ఒకరిది సక్రమ పాతు, మరొకరిది అక్రమ పొత్తు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ గారు కూడా బీజేపీకి ఊడిగం చేశారు. YSR కొడుకు అయ్యి ఉండి బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు, పవన్ ఊడిగం చేస్తున్నారు. బిజేపీ గత 11 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. ప్రత్యేక పెూదా, రాజధాని నిర్మాణం, పోలవరం ఇలా అన్ని హామీల్లో మోసం చేసింది. అయినా కానీ ఒక్కరు కూడా నోరు మెదపరు.