భారత్ న్యూస్ అనంతపురం….ఏపీలో సూపర్ సిక్స్ పధకాలు అమలు పై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి
📍అమలు మాత్రం అరచేతిలో వైకుంఠం.
📍సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్
📍సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యింది సీఎం చంద్రబాబు గారు ?
📍20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా?
📍నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా ?
📍18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా ?
📍అన్నదాత సుఖీభవ కింద సొంతగా రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు.
📍కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో లింక్ పెట్టారు. 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారు.
📍తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారు.
📍రూ.15 వేలు ఇస్తామని రూ.13 వేలకు సరిపెట్టారు.
📍మూడు సిలిండర్లు ఎంత మందికి అందుతున్నాయో అర్థంకాని పరిస్థితి.
📍14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి,
📍సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు.
📍సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదం.
📍చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసం.
📍రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లింది.

📍అభివృద్ధి అటకెక్కింది. సుపరిపాలన కొండెక్కింది.
📍కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం..