భారత్ న్యూస్ గుంటూరు…కోడూరు తాసిల్దార్, అవనిగడ్డ సబ్ రిజిస్టర్, లింగారెడ్డి పాలెం విఆర్ఓ లపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళ
తన పొలాన్ని ఫోర్జరీ రిజిస్ట్రేషన్ చేశారంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందించిన ముస్లిం మహిళ
జిల్లా కలెక్టర్ కు మహిళ అందించిన ఫిర్యాదు ఇదే
మహారాజశ్రీ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి గుడివాడ మండలం కొత్తమాల్లాయపాలెం గ్రామానికి చెందిన షేక్ హసినా బేగం W/o. షేక్ షరీఫ్ వ్రాసుకొను అర్జీ విన్నపం..
విషయం: ఫోర్జరీ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన కోడూరు తహసీల్దార్, అవనిగడ్డ సబ్జిస్ట్రార్పై చర్యలు తీసుకొని, నా పోలానికి జరిగిన ఫోర్జరీ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని కోరుతూ..
అయ్యా,
కోడూరు మండల పరిధిలోని లింగారెడ్డిపాలెం రెవిన్యూలోని చినగుడుమోటు గ్రామంలో సర్వే నెం. 239-1, 239-2లో మా తల్లిగారైన మహ్మాద్ కరీమున్నిసా ద్వారా 0.51సెంట్లు మాగాణి భూమి నాకు సంక్రమించి ఉన్నది. ఈ పోలం నా తల్లి పుట్టింటివారి ద్వారా సంక్రమించగా, గ్రామ పెద్దల సమక్షంలో నా తల్లి 12-06-2024వ తేదీన నాకు సర్వహక్కులు కల్పిస్తూ నాకు స్వాధీనపరిచింది. దీనికి సంబంధించి 15-07-2025న గౌరవనీయులైన కోడూరు మండల తహసీల్దార్ గారికి పట్టాదార్ పాస్‌పుస్తకం ఇప్పించమని అర్జీ ఇచ్చి ఉన్నాను. ఈ అర్జీకి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం నుంచి నాకు ఏవిధమైన సమాచారం రాలేదు. ఈ పోలానికి సంబంధించి రెవిన్యూ అధికారులు ఏవిధమైన సర్వేను నిర్వహించలేదు. ప్రస్తుతం ఈ పోలంలో నేను వరి పంట సాగు చేస్తున్నాను. పంట కోత దశకు వచ్చింది.
అయితే గుడివాడ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన సఫీయసుల్తానా
W/o. మహ్మాద్ హుసేన్ కోడూరు తహసీల్దార్, లింగారెడ్డిపాలెం అప్పటి వీఆర్వో గారి సహకారంతో ఏవిధమైన పత్రాలు, సర్వే ఆధారాలు లేకుండా నా పోలానికి చెందిన సర్వే నెం.239-1, 239-2లో ఉన్న 0.51సెంట్ల భూమిని ఆన్లైన్లో సఫీయసుల్తానా పేరు మీద అడంగల్ నమోదు చేశారు. నేను 15-07-2025వ తేదీనే నా పోలానికి అడంగల్ నమోదు చేయాలని అన్ని పత్రాలు కోడూరు తహసీల్దార్ గారికి అర్జీ రూపంలో ఇచ్చినా, వీటిని పట్టించుకోకుండా డబ్బులు తీసుకొని వేరే వ్యక్తులకు నా పోలాన్ని కట్టపెట్టేందుకు కోడూరు రెవిన్యూ అధికారులు పూనుకున్నారు. తహసీల్దార్ వారు అడంగలు ఆన్లైన్ చేయగానే సఫీయసుల్తానా తన కుమారుడైన రెండు సంవత్సరాల వయస్సు గల యాకోబ్ పేరు మీద 09-09-2025న ఫోర్జరీ చేసి అవనిగడ్డ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు. అడంగల్ మినహా పోలానికి సంబంధించిన పత్రాలు, సర్వే పంచమానా రిపోర్టు లేకుండా అవనిగడ్డ సబజిస్ట్రార్ వారు కూడా వీరితో లాలుచి పడి నా పోలాన్ని ఫోర్జరీ రిజిస్ట్రేషన్ చేశారు.
రిజిస్ట్రేషన్ ఆమోదించిన పోలానికి చూపించిన హద్దు కూడా తప్పుగానే ఉన్నాయి. పోలాన్ని నేను సాగు చేస్తున్నా కూడా తహసీల్దార్ వారి సర్వే సర్టిఫికేట్, పోలానికి సంబంధించిన సరైన పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ ఏవిధంగా చేశారో అర్థం కాని పరిస్థితి. ఈ దొంగ రిజిస్ట్రేషన్‌కు మల్లాయపాలెంకు చెందిన షేక్ జానీ భాషాతో పాటు అవనిగడ్డకు చెందిన దస్తాలేఖరి జంపాని హనుమాన్ కిషోర్ లు సహకరించారు. ఈ పోలంపైనే ఆధారపడి నేను, నా కుటుంబం జీవనం సాగిస్తున్నాను.

కోడూరు తహసీల్దార్, లింగారెడ్డిపాలెం వీఆర్వో, అవనిగడ్డ సబజిస్ట్రార్ సోమ్ముకు ఆశపడి నా పోలానికి సంబంధించిన సర్వే నెంబర్లను వేరే వారిపై రిజిస్ట్రార్ చేయించి, నాకున్న ఆధారాన్ని కోల్పోయేలా చేశారు. ఈ ఫోర్జరీ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసి న్యాయం చేయాల్సిందిగా కాముందులవారిని మిక్కిలి ప్రార్థిస్తున్నాను.
తమ విధేయురాలు
షేక్ హసినా బేగం