ఎదురు మొండి బ్రిడ్జి కి మోక్షం,

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఎదురు మొండి బ్రిడ్జి కి మోక్షం

Ammiraju Udaya Shankar.sharma News Editor…త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం

బ్రిడ్జి నిర్మాణానికి అంగీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*
ఎన్నో దశాబ్దాలుగా దివి సీమప్రజలు కోరుకుంటున్న బ్రిడ్జి నిర్మాణ కల నెరవేరబోతుంది.
గతంలో నాబార్డ్ నిధులు మంజూరు అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణంలో ఎటువంటి పురోగతి లేదు. ఉప ముఖ్యమంత్రి అవనిగడ్డ నియోజకవర్గంలో తుఫాను పర్యటన సందర్భంగా మరోసారి ఈ విషయం వెలుగులోకి వచ్చింది

ఈ విషయమై ఈరోజు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన డిప్యూటీ సీయం కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎం ఎల్ ఏ బుద్ధ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు పాల్గొన్నారు

గతంలో మంజూరు అయిన 109 కోట్లకు అదనంగా అవసరం అయిన మరో 51 కోట్ల నుకూడా నాబార్డ్ ద్వారా మంజూరు చేయించడానికి ఉప ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. త్వరలో నిధులు మంజూరు అయి పనులు ప్రారంభించడం జరుగుతుంది.

ఎదురు మొండి బ్రిడ్జికి నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ బాలశౌరి మరియు అవనిగడ్డ ఎం ఎల్ ఏ బుద్ధ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియ చేశారు

ఎంపీ కార్యాలయం