భారత్ న్యూస్ విజయవాడ…ఆహార కల్తీని అడ్డుకోలేరా?.. FSSAIపై విమర్శలు
ఇండియాలో అత్యంత అవినీతి & పనికిరాని సంస్థ FSSAI అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మార్కెట్లో కల్తీ ఆహారం, నాణ్యత లేని ప్యాకేజ్డ్ ఫుడ్లు యథేచ్ఛగా అమ్ముడవుతున్నా ఈ సంస్థ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. సమస్య వచ్చిన తర్వాతే స్పందిస్తోందని మండిపడుతున్నారు. ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమైన కల్తీ ఆహారాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
