భారత్ న్యూస్ రాజమండ్రి…జనవరి 14న జరిగే రాష్ట్రస్థాయి ఒంగోలుజాతి వృషభ రాజముల బండలాగుడు ప్రదర్శన విజయవంతం చేయాలి – కమిటీ సభ్యులు

:-Ammiraju Udaya Shankar.sharma News Editor… కరపత్రాన్ని ఆవిష్కరించిన కమిటీ సభ్యులు
ఘంటసాల :-
మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి 14 16 వరకు ఘంటసాల గ్రామంలో గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండ లాగుడు ప్రదర్శన విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
ఘంటసాల గ్రామంలోని శ్రీజలధీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండ లాగుడు ప్రదర్శన కరపత్రాలను కమిటీ సభ్యులు శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 14 నుంచి 16 వరకు రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు పోటీలు ప్రదర్శన జరుగుతుందన్నారు.
14న ఆరుపళ్ల విభాగం ప్రదర్శన ఉంటుందని విజేతలైన వారికి రూ.50 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి రూ.40.30 వేలు, 4,5,6 స్థానాల్లో నిలిచిన వాటికి వరుసగా రూ.20, రూ.15. రూ.10 వేల చొప్పున నగదు అందిస్తారని,
15న జరిగే న్యూ కేటగిరి విభాగ ప్రదర్శనలో విజేతలైన జతకు రూ.60 వేలు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వాటికి రూ.50 వేలు, రూ.40 వేలు, 4.5.6 స్థానాల్లో నిలిచిన జతలకు రూ.30, రూ.20. రూ.15. రూ.10 వేల చొప్పున,
16న జరిగే రెండు పళ్ల విభాగంలో విజేతలైన జతకు రూ.25 వేలు, ద్వితీయ, తృతీయ సాధనాల్లో నిలిచిన జతకు రూ.20 వేలు. రూ.15 వేలు, 4, 5,6, స్థానాల్లో నిలిచిన వాటికి వరుసగా రూ.10, రూ.8, రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో ఒంగోలు జాతి వృషభ రాజముల యజమానులు పాల్గొని విజయవంతం చేయడంతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పీఏసీఏస్ ఛైర్పర్సన్ బండి పరాత్పరరావు, వేమూరి రాజేంద్ర ప్రసాద్, దోనేపూడి రవి శంకర్, జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, శ్రీకాకుళం డీసీ ఛైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, గొర్రెపాటి శ్రీనివాస్, కాకుమాని రంగారావు, వేమూరి రమేష్, గొర్రెపాటి నరసింహారావు, గొర్రెపాటి సురేష్, అయినపూడి సన్నీ, గొర్రెపాటి జనార్ధనరావు పాల్గొన్నారు.