బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఉప్పుటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి.

భారత్ న్యూస్ డిజిటల్: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఉప్పుటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్ల దేవాలయంలో ధనుర్మాసము చివరి రోజు భోగి పండుగ తేదీ14.01.2026 బుధవారము రాత్రి 7 గంటలకు శ్రీ గోదా రంగనాయక స్వామి వార్ల కళ్యాణము వైభవోపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అనువంశిక ధర్మకర్త ఆలయ చైర్మన్ బెండపూడి రాధాకృష్ణ తెలిపారు. భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణము తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించ వలసినదిగా విజ్ఞప్తి చేశారు. ………. అలమలకుల