స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం

భారత్ న్యూస్ విశాఖపట్నం..స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలం

సమ్మె విరమించిన స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌.

ఎన్టీఆర్ వైద్య సేవలో అన్ని సేవలను పునఃప్రారంభించాలని అసోసియేషన్‌ నిర్ణయం.

నవంబర్‌ 15లోపు రూ.250 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం.

బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్‌ విధానానికి ఆమోదం.

యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ రూపకల్పన, అమలు కోసం.. ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌తో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం.

ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో తీసుకున్న నిర్ణయాలు.. ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్న అసోసియేషన్‌.

సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సీఎం చంద్రబాబు.