సోనియా గాంధీ గారు అస్తవ్యస్త గురి అయ్యి హాస్పిటల్ చేరారు

భారత్ న్యూస్ నెల్లూరు..

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యంతో దిల్లీలోని సర్ గంగారామ్​ ఆస్పత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, ఛాతీ వైద్యుల అబ్జర్వేషన్​లో ఉన్నట్లు వెల్లడించాయి.

సాధారణ చెకప్​ కోసం ముఖ్యంగా దిల్లీలో కాలుష్యం కారణంగా దగ్గుతో ఆస్పత్రిలో చేరినట్లు వివరించాయి.కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం రాత్రి 10 గంటలకు దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.

ఆమె శ్వాస సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రి కి రావడంతో వెంటనే పరీక్షలు చేశాం. చల్లటి వాతావరణంతో పాటు వాయు కాలుష్యం వల్ల ఆమెకు బ్రాంకైల్​ ఆస్తమా వచ్చింది. ముందు జాగ్రత్తగా ఆమెను ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

యాంటీ బయాటిక్​తో పాటు ఇతర మందులకు ఆమె మంచిగా సహకరిస్తు న్నారు. ఆమెను డిఛార్జ్ చేసే విషయాన్ని వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సుమారు ఒకటి లేదా రెండు రోజుల్లో సోనియా గాంధీ డిఛార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి