విజయవాడ హైవేపై టోల్‌ రుసుముల స్వల్ప తగ్గింపు

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ హైవేపై టోల్‌ రుసుముల స్వల్ప తగ్గింపు

కొన్ని రకాల వాహనాలకే వర్తింపు

🍥హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65)పై టోల్‌ రుసుములు… వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున తగ్గించారు. నూతన టోల్‌ రుసుములు ఏప్రిల్‌ 1 (మంగళవారం అర్ధరాత్రి దాటాక) నుంచి అమలులోకి వస్తాయి.

పంతంగి టోల్‌ప్లాజా దగ్గర 3 యాక్సిల్‌ కమర్షియల్‌ వాహనాలకు రూ.5 చొప్పున తగ్గించారు. ఒకవైపునకు రూ.290 నుంచి 285కు తగ్గింది. 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి 435 నుంచి 430కి తగ్గింది.

కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా దగ్గర 3 యాక్సిల్‌ కమర్షియల్‌ వాహనాలకు రూ.5 చొప్పున తగ్గింది. ఒకవైపునకు 450 నుంచి 445కి… 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.675 నుంచి 670కి తగ్గింది.

ఏపీలోని చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒకవైపు ప్రయాణానికి రూ.105 నుంచి రూ.100కు తగ్గింది. 2 యాక్సిల్‌ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కి తగ్గింది. 3 యాక్సిల్‌ వాహనాలకు 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి రూ.570 నుంచి 565కి తగ్గింది.

మిగిలిన వాటికి రేట్లు యథాతథంగా ఉన్నాయి.