భారత్ న్యూస్ విశాఖపట్నం..స్కై వాక్ బ్రిడ్జి ప్రారంభం
“” “” “” “” “” “” “” “” “” “” “” “”

Ammiraju Udaya Shankar.sharma News Editor…పర్యాటకులకు గుడ్‌న్యూస్. విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ఈ రోజు ప్రారంభం అయింది. నేటి నుంచి వైజాగ్ టూరిస్టులకు కొత్త అనుభూతిని అందించనుంది.
▪️ భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంగా గ్లాస్ బ్రిడ్జ్ కు గుర్తింపు రానుంది.

▪️ 7 కోట్ల రూపాయల తో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ పొడవు 55 మీటర్లు ఉంది. ఇది, సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన మీద నుంచి సముద్ర అందాలు, తూర్పు కనుమలు, వైజాగ్ నగరాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇంపోర్టెడ్ జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ స్కై వాక్‌వే పై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్(Project Skywalk Project) చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.