భారత్ న్యూస్ గుంటూరు…పుల్ అలెర్ట్….

Ammiraju Udaya Shankar.sharma News Editor…జిల్లా కలెక్టరే అలెర్ట్ అవ్వమంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండొచ్చో…జాగ్రత్తగా ఉండాల్సిందే మరీ
మంచినీరు, పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ముందుగా సిద్ధం చేసుకోవాలంట
జిల్లాలో తుఫాన్ కారణంగా ఈనెల 27 నుండి 29వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ వారికి కావలసిన మంచినీరు, పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ముందస్తుగానే సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు.
అంతేకాకుండా తుపాను కారణంగా విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే పవర్ బ్యాంకు, మొబైల్లను పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

అలాగే కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు, చార్జింగ్ ఎమర్జెన్సీ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలనీ కలెక్టర్ తెలిపారు.