వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు

భారత్ న్యూస్ అనంతపురం ..వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే రెండు రోజుల నుంచి తిరుపతి సిట్ కార్యాలయంలో ఇతడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులనూ సిట్ విచారిస్తోంది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.