మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పర్యటన

రాయన గోపాలకృష్ణను పరామర్శించిన సింహాద్రి

భారత్ న్యూస్ గుంటూరు…మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పర్యటన

రాయన గోపాలకృష్ణను పరామర్శించిన సింహాద్రి

పాల్గొన్న పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు

మోపిదేవి:
ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద కోలుకుంటున్న రాయన గోపాలకృష్ణను మాజీ ఎమ్మెల్యే, వైయస్సార కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్  సింహాద్రి రమేష్ బాబు మంగళవారం పరామర్శించారు. మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన రాయన గోపాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మోపిదేవి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరికపాటి వెంకటేశ్వరరావు(బుల్లి), వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు బండారి సూరిబాబు, వైఎస్ఆర్సీపీ కొక్కిలిగడ్డ, బొబ్బర్లంక, కే.కొత్తపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు వరుసగా రాయన సత్యనారాయణ,  యంమ్ అరవింద్, టి. కృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు మీసాల చిట్టిబాబు, కేసాని సుబ్రమణ్యం, కేసాని భవాని, కేసాని బుల్లియ్య, రాయన రాంబాబు, అనిశెట్టి బాబురావు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, తదితరులు పాల్గొని గోపాలకృష్ణ గారిని పరామర్శించారు.