ఆమెకు చెత్తలో రూ. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి.

భారత్ న్యూస్ గుంటూరు…చెత్తకుప్పలో బంగారం

తమిళనాడులోని శివగంగకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీ తన నిజాయతీతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమెకు చెత్తలో రూ. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. పిల్లలు పొరపాటున పడేసిన ఈ నగలను ఆమె పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించింది. సెల్వీ గొప్ప మనసును మెచ్చిన యజమానులు ఆమెకు రూ. 20 వేల బహుమతిని అందజేశారు. గతంలోనూ ఇక్కడి కార్మికులు ఇలాగే తమ నిజాయతీని చాటుకోవడం విశేషం..