ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ..

భారత్ న్యూస్ శ్రీకాకుళం…Ammiraju Udaya Shankar.sharma News Editor…..ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ..

చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలని అవనిగడ్డ నియోజకవర్గ సీనియర్ నేత బొబ్బా గోవర్థన్ సూచించారు. కోడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ పార్టీ బాధ్యులు, క్లస్టర్, బూత్ ఇంచార్జిలకు సుపరిపాలనకు తొలి అడుగు- ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోవర్థన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ, సంపద సృష్టిస్తు ఆ ఫలాలను పేదలకు అందేలా పని చేస్తున్నారన్నారని.. కేవలం సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి చేశారని, పోలవరం పనులు పరుగులు తీస్తున్నాయని, కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తూ ఉద్యోగ కల్పన చేపట్టారన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని పార్టీకి ప్రజల స్పందన తెలపాలని కోరారు.. ఇంటింటికీ వెళ్లి ప్రజల స్పందనను బాట్ లో నమోదు చేయాలని ఇందులో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 20 మంది సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారిలో మండలానికి ఇద్దరు చొప్పున సేవలు అందిస్తారని, అవసరమైన సమయంలో మండలాలకు అదనంగా సిబ్బందిని పంపిస్తామని గోవర్ధన్ తెలిపారు.. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితుడైన కొల్లూరి వెంకటేశ్వరరావును మండల తెలుగుదేశం పార్టీ ఘనంగా సత్కరించింది.. ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే శ్రీనివాసరావు, కర్ర సుధాకర్,
పూత బోయిన శ్రీనివాసరావు, తోట సాంబశివరావు ,అప్పికట్ల రవీంద్రబాబు ,కడవకొల్లు నాంచారయ్య ,పిల్లి మల్లికార్జున రావు, గోగినేని సోమశేఖర్ రావు, వేములపల్లి రాజేష్ వేములపల్లి శ్రీకృష్ణ, కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, మేడికొండ విజయ్, ఉప్పాల వెంకట కోటేశ్వరరావు, ఉప్పాల పోతురాజు ,మోకా యానాదిరావు, అద్దంకి రవి ,కూరాకుల శివయ్య, కాగితంశివప్రసాద్, మహమ్మద్ ఇమ్రాన్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ,బూత్ ఇన్చార్జి లు పాల్గొన్నారు.