ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.

గంటకు 5 కి.మీ. వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం. రాబోయే 12 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం. ఎలుండి ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం. కాకినాడకు ఆగ్నేయంగా 810 కి.మీ. దూరంలో కేంద్రీకృతం. రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, తూ.గో జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు.