భారత్ న్యూస్ రాజమండ్రి…గుంటూరు సిఐడి కార్యాలయం : 27 సెప్టెంబర్

Ammiraju Udaya Shankar.sharma News Editor…సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు, అసభ్యకర వ్యాఖ్యలు, మోర్ఫ్ వీడియోలు పెట్టడం వలన కుటుంబాలపై, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని సీఐడీ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా వికాస్ నగర్‌కు చెందిన కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు “Siva Suprem Siva” అనే ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా ముఖ్యమంత్రి గారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి, కులవివాదాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఘటనలో Cr.No.15/2025 నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విచారణలో ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గడ్డం శివప్రసాద్ (36)ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అలాగే, గుంటూరు, నెల్లూరు, అనంతపురానికి చెందిన కొందరు యువకులు మోర్ఫ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వెనుక ఆర్థిక ఫండింగ్ ఉన్నట్లు గుర్తించినట్లు CID అధికారులు పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా వాడాలని, తప్పుడు లేదా చట్టవిరుద్ధ పోస్టులు పెట్టినవారి పై సైబర్ బుల్లీయింగ్ షీట్లు తెరవబడతాయని, నిఘా ఉంచబడుతుందని CID అధికారులు హెచ్చరించారు. అనుమానాస్పద పోస్టులు ఎవ్వరూ షేర్ చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులను విజయవంతంగా విచారించిన ఇన్స్పెక్టర్లు మధుబాబు, రాంబాబు సిబ్బందిని డీజీపీ అభినందించారు. ఈ సమావేశంలో కె.వి. శ్రీనివాస్ IPS, SP Cyber Crimes CID, రవికిరణ్ DSP Cyber Crimes CID మరియు ఇన్స్పెక్టర్ రాంబాబు పాల్గొన్నారు.
వాట్సాప్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు, డిజిటల్ అరెస్టులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని CID అధికారులు హెచ్చరించారు.
