విశాఖలో విషాదం | సెల్ఫీ మోజు ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

భారత్ న్యూస్ విశాఖపట్నం.విశాఖలో విషాదం | సెల్ఫీ మోజు ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న
మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
సరదాగా పిక్నిక్‌కు వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు – త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) – సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్‌ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.