భారత్ న్యూస్ గుంటూరు…కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం సీజ్..!
కాకినాడ పోర్టులో ఐదు లారీలలో తరలిస్తున్న 140 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు.
ఈ బియ్యం విలువ సుమారు రూ.65 లక్షలు ఉంటుందని అంచనా.. బియ్యంలో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిసినట్లు అధికారులు గుర్తించారు.
విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడానికి తరలిస్తున్న సమయంలో ఈ బియ్యాన్ని పట్టుకున్నారు.

ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.