భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్ విడుదల
టీచర్ల బదిలీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం
అమరావతి :

ఏపీలో టీచర్ల బదిలీ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది.ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ఈరోజు (గురువారం) ప్రకటించనుంది. కొత్త బదిలీల విధానం ప్రకారం ఒకే పాఠశాలలో 5 విద్యా సంవత్సరాలు పూర్తి చేసిన హెడ్మాస్టర్లు, 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి కానుంది. అలాగే కనీసం రెండు ఏళ్ల సర్వీసు ఉన్నవారు కూడా స్వచ్ఛందంగా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.