ఏపీలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే?

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే?

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో పంచాయతీ పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2, 2026 వరకు ఉండటంతో, జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మారింది. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు కూడా ఇచ్చింది. అయితే, కొన్ని రాజకీయ, సాంకేతిక అంశాల కారణంగా ఎన్నికలు ఆలస్యం అవుతాయని విశ్వాసనీయ సమాచారం.