సంక్రాంతి రద్దీ.. 8 వేలకుపైగా APSRTC ప్రత్యేక బస్సులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..సంక్రాంతి రద్దీ.. 8 వేలకుపైగా APSRTC ప్రత్యేక బస్సులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 71 శాతం బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి 2,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.