భారత్ న్యూస్ డిజిటల్ :అమరావతి:
ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోఘనంగా సంక్రాంతి సంబరాలు
పోలీస్ కుటుంబాల తో కలిసి పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు దంపతులు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినారు.
👉 ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు వారి సతీమణి శ్రీమతి ధాత్రి రెడ్డి, ఐఏఎస్ గారితో కలిసి ప్రారంభించారు.
ఏలూరు జిల్లా ప్రజలకు బోగి సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ప్రజలు సుఖ సంతోషాలతో పండుగ జరుపు కోవాలి అని ప్రజలు అసాంఘిక కార్య కలాపాలకు దూరంగా ఉండాలి అని,.
👉 ఏలూరు జిల్లా ప్రజలకు మరియు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీస్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియ చేసినారు.
👉ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాల సభ్యులు రంగు రంగుల హరి విల్లు ముగ్గులు పోటీ లను పెరేడ్ గ్రౌండ్ అంతటా అలంకరించ గా, అందమైన ముగ్గులు వేసిన మహిళలకు
జిల్లా ఎస్పీ దంపతులు బహుమతులు అంద చేసినారు.
👉ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన పండుగల సాంస్కృతిక విశిష్టతను వివరిస్తూ,భోగి,సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యతను వివరించారు.
👉పాడిపంటలు సమృద్ధిగా పండేందుకు మానవులతో పాటు పశువుల పాత్ర ఎంతో కీలకమని,అందుకే పశువు లకు అంకితమైన పండుగలు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు.
👉ఈ కార్యక్రమంలో
పురాతన కాలం నుంచి మానవ జీవితానికి సహక రిస్తున్న ఎద్దుల బండి ప్రదర్శన హరిదాసుల వేషధారణ, బాలిక కర్ర సాము తదితర, సాంప్రదాయ,కార్యక్రమాలునిర్వహించి,సంక్రాంతి సంబరా లకు మరింత శోభను తీసుకువచ్చారు.
👉 ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్ వారు ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ గారు,ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. సూర్య చంద్ర రావు గారు ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీ ముని రాజా గారు, ఏలూరు డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ గారు, ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు గారు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ యు. రవి చంద్ర గారు, ఏ ఆర్ డీఎస్పీ శ్రీ చంద్ర శేఖర్ గారు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బా రావు గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు గారు , ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ గారు ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ గారు, ఆర్‌ఐ శ్రీ పవన్ కుమార్ గారు,సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు గారు గారు, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా గారు ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భోగి పండుగ సందర్భంగా ప్రజలందరికీ భోగ భాగ్యాలు కలగాలని భోగి పళ్ళు ఉత్సవాన్ని అంగరంగ వైభోగముగా నిర్వహించినారు

ఈ సంక్రాంతి సంబరాలు. పోలీస్ కుటుంబాల్లో ఆనందోత్సాహాలను lనింపుతూ సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని మరింత పెంచాయి. ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటు వంటి మహిళలకు మొదటి బహుమతిగా 15000 రెండో బహు మతి గా 10,000 రూపాయలను మరియు మూడో బహుమతి గా 5000 రూపాయలను అందజేసిన జిల్లా ఎస్పీ గారు.