కొత్త స్మార్ట్‌ ఫోన్లలో సంచార్‌ సాథీ మస్ట్‌!.. డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌ ఉండాల్సిందే!

భారత్ న్యూస్ అనంతపురం,కొత్త స్మార్ట్‌ ఫోన్లలో సంచార్‌ సాథీ మస్ట్‌!.. డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌ ఉండాల్సిందే!

ప్రతి కొత్త మొబైల్‌ ఫోన్‌లో 90 రోజుల్లోగా తొలగించడానికి వీల్లేని ప్రభుత్వ సైబర్‌సెక్యూరిటీ యాప్‌ సంచార్‌ సాథీని (Sanchar Saathi) అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు ముందుగానే లోడ్‌ చేయాలని కేంద్ర టెలికం శాఖ అనధికారిక ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిసింది.

ఈ ఉత్తర్వులు స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌తోపాటు వ్యక్తిగత గోప్యత పరిరక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్ద టెలిఫోన్‌ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో 120 కోట్ల మందికిపైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.

ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన పంచార్‌ సాథీ సాయంతో 7 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ కాగా ఒక్క అక్టోబర్‌లోనే 50,000 ఫోన్లు స్వాధీనం అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.