ఏపీలో తల్లికి వందనం.. ఇంటర్ విద్యార్థులకు డబ్బులు జమ ఎప్పుడంటే!

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో తల్లికి వందనం.. ఇంటర్ విద్యార్థులకు డబ్బులు జమ ఎప్పుడంటే!

అమరావతి :

ఏపీలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది 1వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఇంకా డబ్బులు జమ కాలేదు. వీరందరికి జులై 5న నగదును అకౌంట్లలో జమ చేయనుంది. విద్యార్థుల తల్లులకు నేరుగా ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఈ పథకం ద్వారా రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.13 వేలు జమ చేసి, మిగిలిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తారు….