గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కేంద్రం అనుమతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు కేంద్రం అనుమతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఎం చొరవతో ఏపీకి ప్రత్యేక అవకాశం.

5 లక్షల మందికి లబ్ధి.

నవంబర్ 5 వరకు గడువు పెంపు. అర్హులు హౌసింగ్ ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కేంద్రం తీపికబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు కేంద్ర గృహనిర్మాణశాఖ చేపట్టిన ఈ సర్వే గడువు దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితమే ముగిసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల మందికిపైగా పేదలు ఇళ్లు లేకుండా ఉన్నారని అధికారులు గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇటీవల నివేదించారు. దీనిపై స్పందించిన సీఎం..వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. దీంతో తాజాగా కేంద్రం ఆంధ్రప్రదేశ్లో సర్వేకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. నవంబర్ 5 వరకు గడువిచ్చింది. అర్హులెవరైనా ఉంటే గృహనిర్మాణశాఖ ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.