రైస్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్ ల పెంపు🧾

భారత్ న్యూస్ విశాఖపట్నం..రైస్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్ ల పెంపు🧾

మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసినదే.

రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచిన ప్రభుత్వం

కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డ్ లో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా రుసుము పెంపుదల.

గతంలో రూ. 24/- సేవా రుసుం కలిగిన సేవలు రూ.100/- లకు పెంపు

గతంలో రూ.48/- సేవా రుసుముగా గల రైస్ కార్డ్ విభజన సేవ రూ.200/- లకు పెంపు