భారత్ న్యూస్ గుంటూరు…..A.P :
విశ్రాంత జవాన్లు, వితంతువులకు పెన్షన్
సర్వీస్ పూర్తవ్వకుండా అనివార్య కారణాలతో వచ్చేసిన జవాన్లు, ఇప్పటివరకు పెన్షన్ అందుకోని వితంతువులకు నెలకు రూ.3వేల-రూ.5వేల వరకు పెన్షన్ ఇవ్వాలని మాజీ సైనికుల ప్రత్యేకనిధి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
గవర్నర్తో భేటీలో కొన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అనాథలైన మాజీ సైనికుల పిల్లల చదువుకు రూ.30 వేలు, అమరవీరుల విగ్రహాల కోసం రూ.15 లక్షలు వంటి ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
