భారత్ న్యూస్ నెల్లూరు….రిటైరైన ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇటీవలే అమలులోకి తీసుకొచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ (డీఏ), సెంట్రల్ పే కమిషన్ ప్రయోజనాలను ఆపేస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. డీఏ పెంపు, సీపీసీ బెనిఫిట్స్ నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది.
