మచిలీపట్నంతోపాటు విశాఖపట్నంలోనూ రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మైరా బే వ్యూ రిసార్ట్స్,

భారత్ న్యూస్ విశాఖపట్నం,,ఫలించిన మంత్రి కొల్లు రవీంద్ర కృషి

మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మైరా బే వ్యూ రిసార్ట్స్

మచిలీపట్నంతోపాటు విశాఖపట్నంలోనూ రిసార్ట్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మైరా బే వ్యూ రిసార్ట్స్

మసులా బీచ్ ఫెస్టివల్ తో మంగినపూడి బీచ్ కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర

ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం

తద్వారా 880 మందికి ప్రత్యక్ష, 1100 మందికి పరోక్ష ఉపాధి కలగనుందని పర్యాటక శాఖ వెల్లడి

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నూతన పర్యాటక, భూ కేటాయింపుల పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలోని మచిలీపట్నం, విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు మైరా బే వ్యూ రిసార్ట్స్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తమ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఏపీ పర్యాటక శాఖకు పంపించింది. ఈ క్రమంలో సంబంధిత ప్రతిపాదనలు పరిశీలించిన పర్యాటక శాఖ నెల రోజుల అనంతరం ఆ సంస్థ ఐదుగురు భాగస్వామ్యుల నికర విలువ మార్చి 31,2025 నాటికి రూ.166.05 కోట్లుగా గుర్తించింది. పాలసీ ప్రకారం ప్రాజెక్టు ఖర్చులో 25 శాతం ఉంటే ప్రతిపాదనలు అంగీకరిస్తారు. మైరా సంస్థకు సంబంధించి అంచనా వేసిన ప్రాజెక్టు ఖర్చులో 65 శాతం కంటే ఎక్కువ ఉండటంతో సంబంధిత సంస్థ నికర విలువ ప్రమాణంలో అర్హత పొందింది.

రూ.255.91 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో ‘మైరా బే వ్యూ రిసార్ట్స్ మరియు 3000 మంది సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్’ను 15 ఎకరాల్లో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇది పూర్తయితే భీమిలి నుండి భోగాపురం వరకు ఉన్న పర్యాటక కారిడార్ లో ఒక సమగ్ర హై ఎండ్ పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు గా నిలవనుంది. అంతేగాక లగ్జరీ విల్లా తరహా కాటేజీలు, టవర్ హోటల్ బ్లాక్ తో సహా 196 గదులను నిర్మించనుంది. అదే విధంగా ప్రీ -ఫంక్షన్ ప్రదేశాలు, బిజినెస్ మీటింగ్ రూమ్ లు, ఎగ్జిబిషన్ జోన్ లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. 600 మంది సామర్థ్యం గల బ్యాంకెట్ హాల్, 200 మంది సామర్థ్యం గల రెండు బహుళార్ధసాధక బాల్‌రూమ్‌లతో పాటు రూఫ్‌టాప్ ఇన్ఫినిటీ పూల్, స్పాలు, వెల్ నెస్ థెరఫీ జోన్ లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ (400+ మందికి), 20,000 చ.అ.ల రిటైల్/షాపింగ్ ప్రాంతం ఏర్పాటు చేయనుంది. తద్వారా 500 మందికి ప్రత్యక్షంగా మరో 500 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజు ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ. 130.78 కోట్లు. 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా (revenue share) అంచనా రూ. 216.63 కోట్లు. ప్రస్తుతం ఉన్న భూమి విలువ ఎకరానికి రూ.3 .63 కోట్ల చొప్పున 15 ఎకరాలకు రూ.54.45 కోట్లు విలువ చేస్తుంది.

మచిలీపట్నంలో రూ.157.53 కోట్ల అంచనా వ్యయంతో తాళ్లపాలెం గ్రామంలో’ లార్జ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ కమ్ రిసార్ట్’ ను నిర్మించేందుకు 20 ఎకరాలు కేటాయించబడింది. తీర ప్రాంతంలో ఆతిథ్య, వినోద కేంద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలవనున్న ఈ ప్రాజెక్టులో అమ్యూజ్‌మెంట్ పార్క్ తోపాటు వాటర్ పార్క్ & రైడ్‌లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, వెల్‌నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు కానున్నాయి. తద్వారా 380 మందికి ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజు ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ. 12.81 కోట్లు. 99 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వాటా (revenue share) అంచనా రూ. 119.17 కోట్లు గా పర్యాటక శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 26.67 లక్షలు కాగా 20 ఎకరాలకు దాదాపు రూ. 5.33 కోట్లు అవుతుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యక్ష,పరోక్ష పన్ను ఆదాయం, ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి బీజం పడనుందని పర్యాటక శాఖ పేర్కొంది.

మెస్సర్స్ మైరా బేవ్యూ రిసార్ట్స్ అనేది ప్రపంచ స్థాయి రిసార్ట్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ కన్వెన్షన్ సెంటర్‌ల అభివృద్ధి ద్వారా తీరప్రాంత పర్యాటక మౌలిక సదుపాయాలను పునర్నిర్వచించాలనే దార్శనికతతో ఉన్న భాగస్వామ్య సంస్థగా ఏపీ పర్యాటక శాఖ భావిస్తోంది.ప్రస్తుతం మైరా సంస్థ భాగస్వాములతో కలిపి మొత్తం 626 కీలు మరియు 3 కన్వెన్షన్ సౌకర్యాలతో కార్యకలాపాలు నిర్వహిస్తూ 6 ఆతిథ్య ప్రాజెక్ట్‌లలో అనుభవం కలిగి ఉంది.ఈ కంపెనీలలో మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ల్యాండ్‌మార్క్ హోటల్ – రాయ్‌పూర్ CG, రోజ్‌బే రిసార్ట్స్ – రాయ్‌పూర్, మైరా రిసార్ట్ & కన్వెన్షన్ సెంటర్ – రాయ్‌పూర్, ఓమయా గార్డెన్ – రాయ్‌పూర్ (VIP రోడ్), ఓమయా సూట్స్ – రాయ్‌పూర్, లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్ – రాయ్‌పూర్, మైరా సెరాయ్ ఎట్ కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ ఉన్నాయి.