భారత్ న్యూస్ విజయవాడ…సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో అత్యుత్సాహంతో రిమాండ్ చేయొద్దు
ఏపీలోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
రాష్ట్రంలోని జడ్డీలందరికీ సర్క్యులర్ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్
యాంత్రికంగా రిమాండ్ విధించడం సరి కాదు
దీనిపై మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటించాలి
చట్టాన్ని ఏ మాత్రం ఉల్లంఘించినా ఉపేక్షించబోము.. ఒకవేళ చేస్తే వారు కోర్టు థిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది
ఇంకా వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుంది
ఏపీలో ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లు, కామెంట్స్‌కు సంబంధించి నమోదైన కేసులు, అరెస్టులు, రిమాండ్స్కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సర్క్యులర్
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదా కామెంట్‌కు సంబంధించి పలు స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి, నిందితులకు యాంత్రికంగా రిమాండ్ విధించకుండా, కచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలంటూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ
