భారత్ న్యూస్ నెల్లూరు….బంధాలు చెడిపోగానే రేప్ కేసులు పెట్టడం సరికాదంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
తమిళనాడు – తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ తాను కాలేజీ రోజుల నుండి 9 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని తనతో లైంగిక సంబంధంలో ఉండి, తర్వాత నిరాకరించాడని ఫిర్యాదు చేసిన ఓ యువతి
దీంతో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన దేవా విజయ్
విచారణ జరిపి పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇద్దరు ప్రేమలో పడి, శారీరకంగా కలిశాక సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు

ఇద్దరి మధ్య శారీరక బంధం ప్రేమ వల్ల ఏర్పడిందా, వివాహం కోసం చూశారా, కేవలం ఆనందం కోసమే జరిగిందా అనేది వారికి మాత్రమే తెలుసంటూ, ఇలాంటి విషయాల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు