గతేడాది ఈ జాబితాలో 80వ స్థానంలో ఉన్న ఇండియా.. తాజాగా 85వ స్థానానికి

భారత్ న్యూస్ అమరావతి..గతేడాది ఈ జాబితాలో 80వ స్థానంలో ఉన్న ఇండియా.. తాజాగా 85వ స్థానానికి పడిపోయింది. గతేడాది మన దేశ పాస్‌పోర్ట్‌ ఉన్న వారు 62 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే అవకాశం ఉండేది. అది ఇప్పుడు కేవలం 57 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంది. దీంతో ర్యాంకింగ్‌ కూడా పడిపోయింది.

🇸🇬 ఇక ఈ జాబితాలో సింగపూర్ (Singapore) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్‌లాండ్ దేశాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 188 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. ఇక ఐదో స్థానంలో ఆస్ట్రియా, బెల్జియం, డెన్‌మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, ఐర్‌ల్యాండ్ దేశాల నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 187 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.