భారత్ న్యూస్ గుంటూరు …రేషన్ డీలర్ల కమీషన్ ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి
A.P: పేదలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లకు ప్రతి నెలా సప్లయ్ చైన్ మెనేజ్మెంట్ ద్వారా చెల్లిస్తున్న కమీషన్ సొమ్మును ఇక నుంచి డీలర్ల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం డీలర్ల బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వివరాలను అత్యవసరంగా సేకరించాలని ఆదేశిస్తూ సివిల్ సప్లయిస్ కమిషనర్ సౌరభ్ గౌర్ డీ.ఎస్.వో లు అందరికీ సర్క్యులర్ జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘ఎస్ఎన్ఏ-స్పార్ష్ పోర్టల్ కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బు జమ చేసేందుకు ఈ నెల 14వ తేదీ లోగా డీలర్ల డేటాను సేకరించి ఎస్సీఎం డేటా బేస్ తో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ పూర్తయితే డీలర్ల కమీషన్, ఇతర చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వివరిచారు..