భారత్ న్యూస్ రాజమండ్రి…కొత్త రేషన్ కార్డుల్లో తప్పులుంటే సరిచేయించుకోవచ్చు :మంత్రి నాదెండ్ల

A. Udaya Shankar.sharma News Editor…అమరావతి: ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డుల్లోని పేర్లలో తప్పు లుంటే.. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ద్వారా సరిచేయించుకోవాలని.. సెప్టెంబరు 15వ తేదీ నుంచి మనమిత్ర వాట్సప్ లోనూ మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
అలాంటి వారికి కొత్తగా కార్డులు ముద్రించి అందిస్తామని తెలిపారు. గురువారం ఆయన విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యాంశాలివి..
నవంబరు 1 తర్వాత.. కొత్త కార్డు కావాలంటే నామమాత్ర (రూ.35-50 మధ్య) రుసుముపై ఇంటికే పంపిస్తాం.
ఈ-కేవైసీ, ఆధార్లోని సమాచారం ప్రకారమే కొత్త రేషన్ కార్డులు ముద్రించాం.
మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే.. నాలుగో నెల పంపిణీ నిలిచిపోతోంది. అలాంటి వారు సచివాలయాలకు వెళ్లి.. కార్డు చూపి యాక్టివ్ చేయించుకోవచ్చు.
