భారత్ న్యూస్ అనంతపురం,పుట్టపర్తిలో దారుణం: పరిచయాన్ని ఉపయోగించి బాలికపై అత్యాచారం – ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్
పుట్టపర్తిలో జరిగిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఒక హాస్టల్ నుంచి లగేజ్ తరలింపు సందర్భంగా గత నెల 3న ర్యాపిడో డ్రైవర్‌కు బాధిత బాలిక పరిచయమైంది. ఆ ప్రయాణంలో ఫోన్‌పే ద్వారా చేసిన చెల్లింపు నంబర్‌ను డ్రైవర్ సేవ్ చేసుకుని, అప్పటి నుంచి బాలికను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు.

వేధింపులు హద్దులు దాటి, చివరికి ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ వెల్లడించారు.