భారత్ న్యూస్ తిరుపతి బ్రేకింగ్ న్యూస్
అన్నమయ్య జిల్లా మదనపల్లె
యోగ గురు రాందేవ్ బాబా గురువారం ఉదయం మదనపల్లె బిటి కళాశాల మైదానంకు చేరుకున్నారు. బాబాకు సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, అధికారులు పుష్పగుచ్చం అందజేసీ స్వాగతం పలికారు. బిటి కళాశాల గ్రౌండ్ నుండి హార్సిలి హిల్స్ లో జరగనున్న ఓ ప్రైవేట్ ప్రోగ్రాంకు రాందేవ్ బాబా కారులో బయలుదేరి వెళ్లారు. స్థానికంగా ఉన్న పతంజలి ట్రస్ట్ సిబ్బంది తదితరులు రాందేవ్ బాబా వస్తుండడంతో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. రోడ్డు రావాణ, ఫైర్, రెవిన్యూ హాజ రయ్యారు. డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేశారు
