భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్టీఆర్ జిల్లా *
తిరువూరు
రాఖీ పౌర్ణమి రోజున ఎస్సై సత్యనారాయణకు రాఖీ కట్టిన భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలె.శాంతి
సహోదర ప్రేమకు ప్రతిరూపం , ఆత్మీయ బంధాలకు సంకేతాత్మకం, శాంతి సౌభ్రాతృత్వాలను వికసింప జేసే అపురూప వేడుకరక్షాబంధనం రోజున సోదరుడు గా భావించి తిరువూరు ఎస్సై కేవీజీవి సత్యనారాయణకు ఎన్టీఆర్ జిల్లా భారతీయజనతాపార్టీఉపాధ్యక్షురాలు పోలె. శాంతి, సేవిక సమితి కార్యదర్శి పెన్నోజి.నాగమణి పట్టణ పోలీస్ స్టేషన్లో రాఖీకట్టి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బిజెపి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలె శాంతి మాట్లాడుతూ మన సంస్కృతి , సాంప్రదాయాలను ప్రతిబింబింప చేసే రాఖీ పండుగ పరస్పర సోదర భావాన్ని, స్నేహా సౌరభాలను విరజిమ్ముతుందని,కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీపౌర్ణమితెలుపుతుందని,తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయత అనురాగాల నడుమ అట్టహాసంగా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునేదే రాఖీ పౌర్ణమి రోజున సోదరుడు ఎస్సై సత్యనారాయణకు రాఖీ కట్టడం ఆనందంగా ఉందని తెలిపారు.
