భారత్ న్యూస్ విజయవాడ…ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు: APSDMA
ఆంధ్రప్రదేశ్ :
నేడు, ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు చెట్ల కింద నిలబడకుండా, పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి వర్షాలు ప్రారంభమయ్యాయి.
