వారం రోజుల పాటు భారీ వర్ష సూచన – అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor..వారం రోజుల పాటు భారీ వర్ష సూచన – అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం – ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం

వేడి, ఉక్కపోతతో గత కొద్ది రోజులుగా అవస్థలు పడుతున్న ఏపీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో ఈదురు గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన