చీపురుపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది..

భారత్ న్యూస్ విజయవాడ…చీపురుపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది..

చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి కోసం వైయస్ జగన్ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నేను రైల్వే శాఖ డీఎం దగ్గరికి వెళ్లి అనుమతులు తీసుకుని వచ్చి 80 శాతం పనులు పూర్తి చేశాం. తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా 20% పనులు పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉంది. క్రెడిట్ చోరీ ఛాంపియన్ చంద్రబాబు నేడు తాజాగా ఇంకో ప్రాజెక్టు ఘనతను తనఖాతాలో వేసుకుంటున్నారు. చీపురుల్లి రైల్వే బ్రిడ్జి పనులు దాదాపుగా వైయస్ జగన్ హయాంలో 80% పూర్తవగా మిగిలిన ఆ కొద్ది పనులు ఇప్పుడు చేసేసి బాబుకు, కూటమి ప్రభుత్వం నేతలకు అలవాటైన రీతిలో మొత్తం ప్రాజెక్టును తానే నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు. రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తవడానికి టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం రావడానికి చొరవ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చూపు వల్లే వచ్చింది. జీఎంఆర్ సంస్థ మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మాటిచ్చిన ప్రకారంగా పనులు పూర్తి చేశారు.

-బెల్లాన చంద్రశేఖర్ గారు, మాజీ ఎంపీ