ప్రతిపక్షం తీరు స్వచ్ఛమైన మంచినీటి కాలువలా ఉండాలి గానీ.. కలుషితమైన మురుగు కాలువలా ఉండకూడదు.

భారత్ న్యూస్ విజయవాడ…ప్రతిపక్షం తీరు స్వచ్ఛమైన మంచినీటి కాలువలా ఉండాలి గానీ.. కలుషితమైన మురుగు కాలువలా ఉండకూడదు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…గతంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబుకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా? ముందు మీ పార్టీలోని అంతర్గత విభేదాలను సరిచేసుకోండి : వైసీపీ నేతలకు టీడీపీ హితవు

కనపర్తి శ్రీనివాసరావుపై విమర్శలు వైసీపీ నేతల అసహనానికి నిదర్శనం: టీడీపీ నేతల ధ్వజం

అవనిగడ్డ:టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు చేసిన వాస్తవాలను జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం అవనిగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవమని విచారణ సంస్థలు నిజానిజాలు బయటపెడుతుంటే, తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి కాలమే సమాధానం చెబుతుందని మండిపడ్డారు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న కనపర్తి శ్రీనివాసరావు ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ ఉనికిని కాపాడుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కులాల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి వైసీపీదేనని, కూటమి ప్రభుత్వం అందరినీ కలుపుకుని అభివృద్ధి పథంలో సాగుతోందని వారు స్పష్టం చేశారు.అసెంబ్లీ సాక్షిగా సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన చరిత్ర వైసీపీ నాయకులదని అంబటి రాంబాబు మహిళల పట్ల ప్రవర్తించిన తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమైతే, దాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని తప్పు చేసి క్షమాపణలు చెబితే సరిపోదని , ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు గత ఐదేళ్లలో అవనిగడ్డ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మీడియా ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. మా నాయకులు లోకేష్ గారు ప్రవేశపెట్టిన ‘రెడ్ బుక్’ చట్టాన్ని ఉల్లంఘించిన వారి కోసమే తప్ప, సామాన్య ప్రజల కోసం కాదని గుర్తుంచుకోవాలన్నారు.ప్రజలు తిరస్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం విచారకరమని, ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ప్రజలే మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో ఇప్పటికీ మీకు అర్థం కాకపోవడం విచారకరమని ఇప్పటికైనా మురుగు కాలువ లాంటి మాటలు కట్టిపెట్టి, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు. అవనిగడ్డలో కుల రాజకీయాలకు, భౌతిక దాడుల సంస్కృతికి తావులేదని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి ఇమ్మానియేలు,పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,బండే రాఘవ,ఘంటసాల రాజమోహన రావు,దాసినేని శ్రీనివాసరావు,చెన్ను బాబూరావు,మేడికొండ విజయ్,నాగిడి రాంబాబు,గుంటూరు వినయ్ బాబు తదితరులు పాల్గొన్నారు