భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీలో పురమిత్ర యాప్.. సమస్యలకు చెక్
అమరావతి :
ఏపీలో మున్సిపల్ శాఖ పురమిత్ర యాప్ ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకుని స్మార్ట్ఫోన్లో అక్కడి సమస్య తీవ్రత తెలిసేలా ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే చాలు..
సిబ్బంది 24 గంటల వ్యవధిలో సమస్యను పరిశీలించేందుకు వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న యాప్ను ప్రారంభించగా..

మూడున్నర నెలల్లో 10,421 సమస్యలపై ప్రజలు స్పందించారు.
వీటిలో ఇప్పటి వరకు 9,889 పరిష్కారమయ్యాయి.