PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం

భారత్ న్యూస్ విశాఖపట్నం..PSLV-C62 ప్రయోగం: కౌంట్ డౌన్ కు సర్వం సిద్దం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) PSLV- C62 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది. 2026
జనవరి 12న ఉదయం 10:17 గంటలకు
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ఇస్రో అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాంచ్ వ్యూ గ్యాలరీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.