రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

భారత్ న్యూస్ అనంతపురం .. ..రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం – బొబ్బా గోవర్ధన్

చల్లపల్లి మండలం రామానగరంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ అన్నారు.
చల్లపల్లి మండలం రామానగరం 82వ బూత్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ, కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు కృషిచేస్తోందన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగాల కల్పన, పీ4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని వివరించారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా అగస్టు 15వ తేదీ నుంచీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మోర్ల ప్రసాద్, టీఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రావి చిట్టి, వాణిజ్యం విభాగం నేత ఘంటసాల కన్నయ్య, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు మోర్ల శివ, లీగల్ సెల్ నాయకులు కొడాలి మురళి, ఎంపీటీసీలు మాలెంపాటి శ్రీనివాసరావు, పైడిపాముల స్వప్న, క్లస్టర్ ఇంఛార్జి మల్లంపల్లి శివరామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షుడు గొరిపర్తి సుబ్బారావు, నేతలు బోలెం సాయిబాబు, బి.కనకదుర్గ, షేక్ నభీ ఘోరి, దిల్షాద్ నజరానా, కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.