భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…Promotions: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలోనే ప్రమోషన్స్.. ఫైనల్ లిస్ట్..!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మెమో విడుదలైంది. ఇందులో గ్రేడ్-6 నుంచి గ్రేడ్-3 వరకూ ఉన్న కార్యదర్శులకు త్వరలో promotions ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు సీనియారిటీ జాబితాలను తయారుచేయాలని ఆదేశించారు. ఆగస్ట్ 5వ తేదీ వరకు సమాచారాన్ని సేకరించి, ఆగస్ట్ 7న తాత్కాలిక జాబితాను విడుదల చేయనున్నారు.
అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, ఆగస్ట్ 27న ఫైనల్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అధికారుల లక్ష్యం ఈ నెలాఖరులోగా ప్రమోషన్ ప్రక్రియను పూర్తి చేయడం. గతంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన అనంతరం గ్రేడ్-5, గ్రేడ్-6 కార్యదర్శుల పదోన్నతుల విషయంలో చాలా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఐదేళ్లుగా ఒకే కేడర్‌లో ఉన్న ఉద్యోగులకు నిరాశ ఏర్పడింది.
గ్రేడ్-5 కార్యదర్శులకు సరైన drawing authority లేకపోవడం వల్ల అధికార పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇదే సమయంలో గ్రేడ్-6 కార్యదర్శులుగా పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్లకు మాత్రం అధికారాలు ఇచ్చారు. దీంతో సమర్థవంతమైన పదోన్నతుల కోసం అధికారులు తాజా చర్యలు ప్రారంభించారు.
ఈ Promotions ప్రక్రియ పూర్తవడం ద్వారా, పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. అలాగే, వ్యవస్థలో సమర్థత పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక పరిపాలన మరింత గట్టిగా ముందుకు సాగేందుకు ఇది కీలకమైన అడుగుగా మారనుంది.
