భారత్ న్యూస్ కర్నూల్…Ammiraju Udaya Shankar.sharma News Editor….156 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి
డిప్యూటీ ఎంపీడీవోలు, పరిపాలన అధికారులు 156 మందికి ఎంపీడీవోగా ప్రభుత్వం గురువారం పదోన్నతులు కల్పించింది. పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం పదేళ్లలో ఇదే మొదటిసారి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణ తేజ జారీ చేశారు. 94 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, మండల పరిషత్, జిల్లా పరిషత్తు, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని పరిపాలన అధికారులు మరో 62 మంది ఎంపీడీవోలుగా పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు. పలువురు ఎంపీడీవోలకు డివిజినల్ డెవలప్మెంట్ అధికారులు (డీఎల్ డీవో)గా ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. ఆ ఖాళీలను డిప్యూటీ ఎంపీడీవో, పరిపాలన అధి కారులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు.
